| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భీమారంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

భీమారంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గీత వీరేశం గుప్త జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలపన చేస్తూ జండా వందనం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి గ్రామ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం గ్రామ పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆటలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సర్పంచ్ గీత వీరేశం గుప్త, ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్ ,వార్డు సభ్యులను సన్మానించారు.


ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ రాములు నాయక్, వార్డు సభ్యులు రమాదేవి,సంగీత,వీరేశం,ప్రశాంత్ గౌడ్, సరోజ రాజేశ్ నాయక్, గ్రామస్థులు, విద్యార్థులు వివిధ పార్టీలా నాయకులు, పాఠశాల సిబ్బంది విద్యార్థులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Previous నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Next ఎన్ ఈ సి సి దినోత్సవం సందర్భంగా శాస్త్రి నగర్ వృద్ధుల మానసిక వికలాంగుల ఆశ్రమంలో గుడ్లు, అరటి పండ్లు పంపిణీ
ADVERTISEMENT