Posted on 2026-01-26 14:21:41
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జండా ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జర్నలిస్ట్ లకు క్రికెట్, క్యారం, చెస్, షటిల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. క్రికెట్ ఏ టీఎం విజేత జట్టుకు కు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేశారు. క్రికెట్ బీ టీం రన్నర్ జట్టుకు ప్రధాన కార్యదర్శి సుభాష్ చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. షటిల్, చెస్, క్యారం పోటీల్లో క్రీడా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టులకు ప్రధమ ద్వితీయ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ లు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అనునిత్యం వార్తలు సేకరించే విధులు నిర్వహిస్తూ ఉంటారు అందుకు కొద్దిపాటి ఉపశమనంగా జర్నలిస్టులకు క్రీడా పోటీలను నిర్వహించుకోవడం ఆనవాయితిగా వస్తుందన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, నగర జర్నలిస్టు, సబ్ ఎడిటర్లు, స్టాఫ్ రిపోర్టర్లు, ఎడిటర్లు, బ్యూరో చీఫ్ లు, సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >