Posted on 2026-01-25 08:20:41
డైలీ భారత్, స్పెషల్:
సకలము నాదే సర్వము నేనే అంటూ
వికల కకలమై ఆగమాగం తిరుగుతూ
డబ్బు సుడిగుండం లో పడి చెట్టు చేమలు
నాశనం చేస్తూ ప్రాణవాయువు కోసం
ప్రాకులాడుతున్నాం
అడవులన్నీ హరించి పకృతి గుండెలో గునపాల్ని దించి ఎత్తెన భవన నిర్మాణాలు చేపడుతు
మృత్యువుకు స్వాగతం పలుకుతున్నాం
నేలమ్మ రెప్పల నుండి జారిన రుధిర
కన్నీటి చుక్కలతో నా కలం తడిసి
అడవులను వృక్షాలను అంతం చేసిన
మనకు బ్రతుకే హక్కు నీ కెక్కడదని
అడగమంటుంది పకృతి మాత
మనుషులు చేసిన దుస్సాహస వికృత చేష్టలకు
రుతుపవనాలు కనుమరుగై పోతున్నాయి
స్వలాభ ముసుగులో మనం చేస్తున్న
చేష్టల వల్ల బావితరాల బ్రతుకులు
కనుమరుగై పోతున్నాయి
కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్న మనల్ని భగ్గున మాడి మసైపొపోతారని హెచ్చరిస్తున్నది పకృతి మాత
చిరు మొక్కను పెంచితే
చిరకాలం నీడనిస్తూ
కుటుంబానికి సమాజానికి
నీడై నిలుస్తుంది
పకృతిని పది కాలాలు కాపాడుకునేందుకు
ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరుకుంటూ
మీ
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >