Posted on 2026-01-23 17:14:04
డైలీ భారత్, ఛత్తీస్‌గఢ్: తల్లి చేతుల్లో ఉన్న పసికందును కోతి లాక్కెళ్లి బావిలో పడేస్తే.. చిన్నారికి వేసిన డైపర్ వల్ల ప్రాణాలు నిలిచిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. సియోని జిల్లాలోని గ్రామంలో ఓ మహిళ తన 20 రోజుల పసికందుతో ఇంటి బయట కూర్చుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన కోతులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. ఓ కోతి మహిళ ఒడిలో ఉన్న చిన్నారిని లాక్కెళ్లింది. వెంటనే మహిళ, చుట్టుపక్కల వారు అరుస్తూ దానిని వెంబడించారు. దీంతో కోతి దూరంగా ఉన్న ఓ బావిలో చిన్నారిని విసిరేసి వెళ్లిపోయింది. పసిబిడ్డ కోసం వెతుకుతూ వచ్చిన గ్రామస్థులకు చిన్నారి బావిలో తేలుతూ కనిపించడంతో వెంటనే రక్షించారు. పాపకు వేసిన డైపర్ లైఫ్ జాకెట్‌లా నీటిలో తేలడం వల్లే చిన్నారి ప్రాణాలు నిలిచాయని స్థానిక నర్సు రాజేశ్వరి పేర్కొన్నారు. బావిలో నుంచి తీసిన వెంటనే శిశువుకు అత్యవసర చికిత్స అందించారు. కోతులు, ఇతర అడవి జంతువులు తరచూ ఇళ్లలోకి వచ్చి దాడి చేస్తున్నాయని గ్రామస్థులు వాపోయారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదన్నారు.
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >