Posted on 2026-01-23 15:25:13
ఉర్స్ ఆధ్యాత్మిక ఉత్సవంగా నిలవాలంటే నిర్లక్ష్య పాలనకు తెరపడాలి
పవిత్ర ఉర్స్ ఉత్సవ వైఫల్యానికి బాధ్యులు ఎవరు?
వక్ఫ్ బోర్డు నిర్లక్ష్యం...సమస్యల వలయంలో పవిత్ర ఉర్స్ ఉత్సవం
ఉర్సులో అస్తవ్యస్త ఏర్పాట్లు, అడ్డగోలుగా వసూళ్లు
డైలీ భారత్, హుజూర్ నగర్: ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదించాల్సిన జాన్ పహాడ్ దర్గా ఉర్స్ ఈసారి అవస్థల ఉత్సవంగా మారింది. వేలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర కార్యక్రమం, పరిపాలనా వైఫల్యాలు, వక్ఫ్ నిర్లక్ష్యం, సౌకర్యాల లేమితో సమస్యల వలయంలో చిక్కుకుంది. ఉర్స్ రోజుల్లో దర్గా పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిట లాడుతుంటే వారికి కనీస వసతులు కల్పించడంలో సంబంధిత శాఖలు ఘోరంగా విఫలమయ్యాయి.
కనీస సౌకర్యాలు లేక అల్లాడిపోతున్న సైదన్న భక్తులు
తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి స్థలాలు వంటి ప్రాథమిక సదుపాయాలు కనీస స్థాయిలో కూడా లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఉర్సా లేక పరీక్షా అన్న స్థాయిలో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉర్స్ రోజుల్లో ట్రాఫిక్ నియంత్రణ ఇబ్బంది గా మారింది. అంబులెన్స్ వెళ్లేందుకు కూడా మార్గం లేని పరిస్థితి నెలకొనడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. భక్తుల సంఖ్యకు తగిన పోలీస్ బందోబస్తు లేకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే యంత్రాంగం స్పష్టంగా కనిపించకపోవడం ప్రమాదకర పరిస్థితులకు ఆహ్వానం పలికినట్టేనని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
వక్ఫ్ బోర్డు పనితీరుపై పలు అనుమానాలు
దర్గా నిర్వహణలో వక్ఫ్ కమిటీ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వక్ఫ్ బోర్డు అధికారులుదళారులతో కుమ్మక్కయి భక్తులను నిలువునా దోచుకుంటున్నారని
పెద్ద ఎత్తున విమర్శలున్నాయి
ఉర్స్ సందర్భంగా ఒక్క గొర్రెపోతు లేదా మేక పోతను హలాల్ చేస్తే రూ.1000 నుండి రూ.2000 దర్గాలో ఫతిహాలిస్తే రూ. 1000నుండి రూ.1500, తలనీలాలు అర్పిస్తే రూ.200 నుండి రూ.500 వరకు భక్తులను బెదిరించి వారి వద్ద నుండి అడ్డగోలుగా దోచుకుంటున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
అనధికార దుకాణాలు...అధిక వసూళ్ల దోపిడీ
ఉర్స్ పరిసరాల్లో అనుమతి లేని దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. భక్తుల నుంచి ఇష్టానుసారంగా ధరలు వసూలు చేయడం పట్ల ఎవరికి ఫిర్యాదులు చేయాలో కూడా స్పష్టత లేదు.
పారిశుధ్య లోపాలతో ఆరోగ్య ముప్పు
చెత్త తొలగింపు సరిగా జరగక దర్గా పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయి. ఇది వ్యాధుల ముప్పుకు దారితీసే పరిస్థితి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వక్ఫ్ బోర్డును, ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగాన్ని తక్షణమే స్పందించాలంటూ అని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >