Posted on 2026-01-23 14:21:39
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రతి ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి అన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మన భారత దేశం ప్రపంచంలో అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశమని, ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని, ఓటు హక్కు విలువ మనతోపాటు, తోటి వారికి తెలియజేయలన్నారు. ఓటును తాత్కాలిక ప్రలోభాలకు లొంగకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో మనమందరం బాధ్యతగా పాల్గొని ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ "భారత దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని" వివిధ శాఖల అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా గ్రామీణాభివృద్ది పిడి మరియు స్వీప్ నోడల్ అధికారి శ్రీలత, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >