Posted on 2026-01-23 12:30:20
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ కంటేశ్వర్ లో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి , రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఐజి మల్టీజోన్ వన్ చంద్రశేఖర్, సిపి సాయి చైతన్య లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రజలకు చేరువగా పోలీసింగ్ వ్యవస్థ ఉందని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్ర అమోఘమని, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకే అత్యాధునిక వసతులతో ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖ ఆధునీకరణకు కట్టుబడి ఉందని, రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న పోలీస్ స్టేషన్ల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారికి భరోసా ఇచ్చేలా సిబ్బంది ప్రవర్తించాలని, త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని, శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని ఆయన ఆకాంక్షించారు.ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అవసరమని, కంటేశ్వర్ ప్రాంత ప్రజలకు ఈ రూరల్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు.నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనం అందుబాటులోకి రావడంపై ఎమ్మెల్యే భూపతిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఉండాలని, ఈ ప్రాంతంలో నేరాల నియంత్రణకు పోలీసులు మరింత కృషి చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. నేర రహిత సమాజం సిసి కెమెరాల నిఘా క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ పెంచడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. నూతన భవనాల్లో సిబ్బందికి మెరుగైన పని వాతావరణం లభిస్తుందని, ఇది వారి పనితీరును మెరుగుపరుస్తుందని అన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ విషయంలో ప్రజలను ముఖ్యంగా యువతను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సిపి ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >