| Daily భారత్
Logo




జనసేన పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షునిగా ఉసికల రమేష్

News

Posted on 2026-01-20 12:41:40

Share: Share


జనసేన పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షునిగా ఉసికల రమేష్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షునిగా అనంతారం గ్రామానికి చెందిన యువ నేత ఉసికల రమేష్ ఎన్నికయ్యారు. హైదరాబాద్, కూకట్ పల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇటీవల జరిగిన పార్టీ ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి భారీగా జనసైనికులు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర నాయకులు ఈ సందర్భంగా జన సైనికులకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నియోజకవర్గ కమిటీ నియామకాలను మిరియాల రామకృష్ణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ కమిటీ నియామకాలను వేముల కార్తీక్ కు అప్పజెప్పారు. ఇందులో భాగంగా జూలూరుపాడు మండల జనసేన అధ్యక్షుడిగా ఉసికల రమేష్ ను ఎన్నుకున్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి మాట్లాడుతూ పార్టీ పోటీ చేసిన దగ్గర గెలుపు కోసం ప్రతి ఒక్కరూ గెలుపే లక్ష్యంగా  పనిచేయాలని ఆదేశించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడుగా ఎన్నికైన ఉసికల రమేష్ మాట్లాడుతూ పార్టీలో ఈ బాధ్యతలను అప్పగించినందుకు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ వేముల కార్తీక్, ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్  మిరియాల రామకృష్ణ, వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ కట్ల రామకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, పార్టీ అధిష్టానం ఆదేశానుసారం నడుచుకుంటూ, కార్యకర్తల సమన్వయంతో  ముందుకు సాగుతానన్నారు

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >