డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లుపంచాయతీ పరిధిలో కూచికుంట రోజురోజుకు కనుమరుగైపోతుంది ఇదేమిటనే ప్రశ్నించే నాధుడే కరువయ్యాడు చూసి చూడనట్లు గ్రామపంచాయతీ అధికారులు మరియు జూలూరుపాడు మండల రెవిన్యూ అధికారులు చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారు రోడ్డుకు ఇరువైపులా కలేబరాలు చెత్తాచెదారం పడేయడం రోడ్డు దుర్గంధ వాసనతో వెదజల్లుతుంది మరియు ఆక్రమ నిర్మాణ కట్టడాలు ఎఫ్ టిఎల్ లోతట్టు ప్రాంతాలను పూడ్చి కబ్జాలకు అడ్డగా మారిందా? ఇకనైనా అధికారులు మేల్కొని కూచికుంట సర్వేనెంబర్. 626 ఎంత విస్తీర్ణం ఉంటుందో రెవిన్యూ అధికారులు సర్వేచేసి చుట్టూ కాంపౌండ్ నిర్మించాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు ఇట్టి భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనపరచుకోలేని ఎడల అతి త్వరలో జిల్లా కలెక్టర్ మరియు రెవిన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం ఇస్తామని గ్రామస్తులు ఆవేదనతోతెలియపరచుకుంటున్నారు ఇకనైనా అధికారులు మేల్కొని కాంపౌండ్ నిర్మించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు
News
జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో అక్రమ నిర్మాణాల అడ్డగా కూచికుంట చెరువు ?