| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత : సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత :  సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుజాతనగర్ సెంటర్ లో తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన Arrive Alive ప్రోగ్రామ్ లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను( Black Spots) R & B AE, AMVI మానస, సుజాతనగర్ స్టేషన్ సిబ్బంది తో విసిట్ చేసి గుర్తించడం జరిగింది. అందులో సుజాతనగర్ పరిధిలో సుజాతనగర్ సెంటర్, Opposite గ్రోమోర్, వేపలగడ్డ రైల్వే బ్రిడ్జ్, డేగలమడుగు గ్రామ మలుపు, సుజాతనాగర్ పత్తి మార్కెట్ ఎదురుగా గల రోడ్ , మొదలగు ప్రాంతాలను గుర్తించడం జరిగింది.  రోడ్డు ప్రమాదాలు నివారించాల్సిన భాద్యత ప్రజలందరి మీద ఉంది. ఒక కుటుంబం లో ఒక వ్యక్తి మరణించడం అంటే అతను మన మధ్యనుండి వెళ్లిపోవడం కాదు ఒక కుటుంబం రోడ్డు మీద పడడం. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి అందరి సగటు వయసు ఎక్కువగా 15  నుండి 40 లోపు వారే ఉన్నారు. దీనికి ప్రాథమిక కారణాలు హెల్మెట్ లేకపోవడం, అతి వేగం, మద్యం సేవించడం వంటివి ఉన్నాయి. పోలీస్ వారు వెహికల్ చెకింగ్ చేసి ఫైన్స్ విధించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీస్ వారు పట్టుకున్న చాలా మంది వాహనదారులు మమ్మల్ని తిట్టుకుంటారు కానీ వారు జాగ్రత్తగా గమ్యం చేరడం కోసం వారికి ఒక హేచ్చరికలాగా ఉండాలని మేము చెకింగ్ చేస్తాము. అంతే కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశ్యం కాదు.దయచేసి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు వ్యక్తి గతంగా భాద్యత వహించాలని అక్కడ విచ్చేసిన ప్రజలతో ప్రమాణం కూడా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది తదితరులు కార్యక్రమం పాల్గొన్నారు

Previous జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో అక్రమ నిర్మాణాల అడ్డగా కూచికుంట చెరువు ?
Next అన్నపురెడ్డిపల్లి మండలం పశువుల అక్రమ రవాణా దారుల ఇద్దరు వ్యక్తులుఅరెస్ట్
ADVERTISEMENT