Posted on 2026-01-17 17:15:13
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి . హుస్సేని (ముజీబ్) అధ్యక్షతన.. మర్రి చెన్నారెడ్డి మానవనుల ఇనిస్టిట్యూట్ కాన్ఫరెన్స్ హాల్ హైదరాబాద్ లో శనివారం టీఎన్జీవో కేంద్ర సంఘ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి, టీఎన్జీవో కేంద్ర సంఘ డైరీ, క్యాలెండర్ ని ఆవిష్కరించారు. అనంతరం సి ఎస్ మాట్లాడుతూ టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలకు మరియు రాష్ట్ర కార్యవర్గ బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ... ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేరవేయుటలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఉద్యోగులందరికీ, అభినందిస్తూ... ఉద్యోగుల సమస్యల పట్ల,... ప్రభుత్వంతో సమన్వయపరచుకొని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తానని తెలుపారు. ఈ సందర్భంగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. త్వరలో టిఎన్జీవో 80 వసంతాల కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని ఎల్బి స్టేడియం లో అట్టహాసంగా నిర్వహించుకోబోతున్నామని తెలిపారు. అనంతరం సి ఎస్ కి ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందజేసి, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి, ఆత్మీయ జ్ఞాపకను రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి టీఎన్జీవో జిల్లా పక్షాన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టిఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్ తదితరులు హాజరయ్యారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >