| Daily భారత్
Logo




ఉస్మానియా మస్జీద్‌లో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి

News

Posted on 2026-01-17 10:54:07

Share: Share


ఉస్మానియా మస్జీద్‌లో నెలకొని ఉన్న  సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఏఐఎంఐఎం సూర్యాపేట జిల్లా జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ గౌస్ ఖాన్

డైలీ భారత్, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని చారిత్రకమైన ఉస్మానియా (వక్ఫ్)మస్జీద్‌లో నెలకొని ఉన్న సమస్యల పట్ల ముస్లిం సమాజం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుందని ఏఐఎంఐఎం సూర్యాపేట జిల్లా జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ గౌస్ ఖాన్ శనివారం సోషల్ మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న ఈ మస్జీద్‌లో పరిపాలనా నిర్లక్ష్యం, మౌలిక వసతుల లోపాలు, ఆర్థిక పారదర్శకత లేకపోవడం వంటి అంశాలు పెద్ద సమస్యలుగా మారాయని అన్నారు.

జానిమాజుల కొరత, అజాన్ మైకు ఏర్పాటు కొరకు పిల్లర్,మస్జీద్ ముందు భాగంలో రేకుల షెడ్ నిర్మాణం, వజూ ఖానా లో టైల్స్ ఏర్పాటు, మస్జీద్‌లో నీటి సప్లై కొరకు 2 మోటార్లు,చిన్న పిల్లలు మస్జీద్‌కు వచ్చి చదువుకోవడానికి మక్తబ్ సౌకర్యం లేకపోడం, ఖబ్రస్తాన్లో మోటార్, లైటింగ్ ఏర్పాటు,జనాజా గుసూల్ చేయించ డానికి ఇద్దరు వ్యక్తులను నియమించుట, వజూ కొరకు నీటి సదుపాయాలు, టాయిలెట్ల అపరిశుభ్రత వంటి సమస్యలతో ముస్లిం సోదరుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ముఖ్యంగా జుమ్మా నమాజ్‌, రమజాన్‌ వంటి రద్దీ సమయాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండవని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదే విధంగాఉస్మానియా వక్ఫ్ కాంప్లెక్స్ ద్వారా అద్దెల రూపంలో వచ్చే ఆదాయంపై ఎలాంటి పారదర్శకత లేకపోవడం పట్ల  అనుమానాలున్నాయన్నారు. ఖర్చుల వివరాలు బహిర్గతం చేయకపోవడం వల్ల ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయన్న  అన్నారు.ఇంకా మస్జీద్‌కు చెందిన వక్ఫ్ భూములపై అక్రమ ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ వాటిని తొలగించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు.ఈ అంశంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. 

భద్రతా పరంగా సీసీ కెమెరాలు లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తుందని సరిఅయిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల మస్జీద్ భద్రతకే ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రమజాన్, బక్రీద్ వంటి ముఖ్య పండగ సందర్భాల్లో కూడా కనీస ప్రాథమిక ఏర్పాట్లు చేయడం లేదని ఆయన మండిపడ్డారు.ఈ నేపథ్యంలో ఉస్మానియా (వక్ఫ్) మస్జీద్ సమస్యలపై వక్ఫ్ బోర్డు తక్షణమే జోక్యం చేసుకుని బాధ్యతా యుతమైన ప్రత్యేక నిర్వహణ కమిటీని నియమించి మస్జీద్ నిర్వహణను పూర్తిగా పారదర్శకంగా చేయాలని గౌస్ ఖాన్ డిమాండ్ చేశారు.మస్జీద్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ నిర్వహించడం,అక్రమ ఆక్రమణలను తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులు, వక్ఫ్ బోర్డు నిర్లక్ష్య వైఖరిని వీడాలని లేనిపక్షంలో శాంతియుత ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >