| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

ఒంటరి జీవితం తోడుకోసం పాట్లు

డైలీ భారత్ డెస్క్: ఒంటరి జీవితానికి తోడు వెతుక్కున్న ఓ మెకానిక్‌ ఆశలపై కేటుగాళ్లు నీళ్లు చల్లారు. పెళ్లయిన మరుసటి రోజే నవవధువు కళ్లుగప్పి ఉడాయించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.

స్థానికంగా మెకానిక్‌గా పనిచేస్తున్న ఆరిఫుద్దీన్ మొదటి భార్యకు దూరమయ్యాడు. వయసు మీరడంతో ఒంటరితనం భరించలేక, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువతితో వివాహం చేసుకున్నాడు. అమ్మాయి కుటుంబ పరిస్థితి బాగాలేకపోవడంతో పెళ్లి ఖర్చులని రూ. 60,000 ఎదురు ఇచ్చాడు. పెద్దల సమక్షంలో లగ్గం జరిగిందని సంబరపడ్డాడు.

కానీ, పెళ్లి జరిగిన మరుసటి రోజే ఉదయం లేచి చూసేసరికి నవవధువు ఇంట్లో లేదు. ఎక్కడా వెతికినా ఆచూకీ దొరకలేదు. అమ్మాయి తరఫు వారి నుంచి కూడా స్పందన లేకపోవడంతో.. డబ్బుల కోసమే కొందరు కలిసి ఈ పెళ్లి నాటకం ఆడించారన్న అనుమానంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వధువు కాల్‌ డేటా, సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Previous ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Next చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్
ADVERTISEMENT