| Daily భారత్
Logo




తెలంగాణలో 9 జిల్లాల్లో రైస్ మిల్లులపై దాడులు.. భారీ అక్రమాలు వెలుగు

News

Posted on 2026-01-13 23:23:33

Share: Share


తెలంగాణలో 9 జిల్లాల్లో రైస్ మిల్లులపై దాడులు.. భారీ అక్రమాలు వెలుగు

రూ.60 కోట్లకు పైగా విలువైన ధాన్యం దారి మళ్లింపు

అక్రమాలకు పాల్పడిన 14 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు

ఒక మిల్లు మూసివేత, పలు మిల్లుల లైసెన్సులు రద్దుకు సిఫార్సు

నిఘా ఆధారంగా దాడులు చేశామన్న విజిలెన్స్ డీజీ శిఖా గోయల్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. పేదలకు పంపిణీ చేయాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (వీ&ఈ) అధికారులు కొరడా ఝుళిపించారు. 9 జిల్లాల్లోని 19 రైస్ మిల్లులపై ఏకకాలంలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో రూ.60 కోట్లకు పైగా విలువైన ధాన్యం దారి మళ్లినట్లు గుర్తించారు. ఈ అక్రమాలకు సంబంధించి 14 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా, ఒక మిల్లును మూసివేశారు.ప్రభుత్వం రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు (కస్టమ్ మిల్లింగ్ రైస్ - సీఎంఆర్) రైస్ మిల్లులకు కేటాయిస్తుంది. ఈ బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందిస్తుంది. అయితే, జనవరి 12న మహబూబాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని మిల్లులపై దాడులు జరిగాయి. ఈ తనిఖీల్లో 14 మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు తేలింది. మొత్తం 1.90 లక్షల క్వింటాళ్ల ధాన్యం, 1.72 లక్షల బస్తాలు మాయమైనట్లు అధికారులు నిర్ధారించారు.ప్రధానంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో రూ.19.73 కోట్లు, సూర్యాపేటలో రూ.19.32 కోట్లు, నారాయణపేటలో రూ.15.91 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు తేలింది. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నష్టాన్ని రాబట్టాలని, వారి లైసెన్సులను రద్దు చేసి, బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని పౌరసరఫరాల శాఖకు సిఫార్సు చేశారు. తీవ్రమైన ఉల్లంఘనల కారణంగా పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలం, పూసాల గ్రామంలోని జానకీరామ ఇండస్ట్రీస్‌ను మూసివేశారు.ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని ఏమాత్రం సహించబోమని విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ స్పష్టం చేశారు. "నిఘా వర్గాల సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించి భారీ మోసాన్ని బయటపెట్టాం. మరో ఐదు మిల్లులకు రికార్డుల నిర్వహణలో లోపాలపై నోటీసులు జారీ చేశాం" అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.2025-26 ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. అయితే, ఇలాంటి అక్రమాలు ప్రభుత్వ లక్ష్యాలకు గండికొడుతున్నాయి. భవిష్యత్తులోనూ తనిఖీలు కొనసాగుతాయని, ఎవరైనా అక్రమాలను గుర్తిస్తే టోల్ ఫ్రీ నంబర్ 14432కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >
Image 1

బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-15 06:39:17

Readmore >
Image 1

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-14 22:44:54

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు

Posted On 2026-01-14 18:45:43

Readmore >
Image 1

పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Posted On 2026-01-14 17:46:55

Readmore >
Image 1

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-01-14 17:45:54

Readmore >
Image 1

సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

Posted On 2026-01-14 17:44:56

Readmore >
Image 1

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-01-14 17:43:41

Readmore >
Image 1

గల్ఫ్ మృతదేహం తరలింపు... ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం

Posted On 2026-01-14 17:39:34

Readmore >
Image 1

బ్యాగ్‌ బరువు ఉండదక్కడ

Posted On 2026-01-14 15:26:21

Readmore >