| Daily భారత్
Logo




ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవం

News

Posted on 2026-01-13 04:45:53

Share: Share


ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవం

ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఐవీఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్స్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఐవిఎఫ్ నిరంతరం పాటుపడుతుందని వైశ్యుల కోసమే కాకుండా,సమాజ హితం కోసం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎర్రం చంద్రశేఖర్,దొంతి సుధాకర్,కస్వ వెంకటేష్ లను కామారెడ్డి జిల్లా ఐ.వి.ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులుగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చిలువేరి మారుతికి అవకాశం కల్పించడం జరిగిందని తెలియజేశారు,అధిక సంఖ్యలో సంఖ్యలో ఆర్యవైశ్యులు ఐవిఎఫ్ లో బాధ్యతలు చేపట్టడం ఎంతో అభినందనీయమని అన్నారు.

దేశవ్యాప్తంగా ఐవిఎఫ్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని ప్రిలిమ్స్ పాస్ అయిన వైశ్య అభ్యర్థులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం, రక్తదానం,అన్నదానం,పేదలకు ఆర్థిక సహకారం,ఆడపిల్లల పెళ్ళిళ్లకు పుస్తే మెట్టల పంపిణీ,పేద విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కామారెడ్డి జిల్లాలో రానున్న రోజుల్లో ఐవిఎఫ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని అన్నారు కామారెడ్డి జిల్లా మహిళా విభాగం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులుగా బుక్క రజని, చిలువేరి శ్రీదేవి,గజవాడ అన్నపూర్ణ, యువజన విభాగం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులుగా ఎర్రం ఈశ్వర్,కౌడ ప్రవీణ్,దొంతి నిఖిల్,జిల్లా ఆధ్యాత్మిక కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోశాధికారులుగా ఎల్లంకి సుదర్శన్ ఎర్రం విజయ్ కుమార్ పదిర కాశీనాథం,ఉపాధ్యక్షులు,సంయుక్త కార్యదర్శి, యువజన విభాగం మహిళా విభాగం కమిటీలు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్, కోశాధికారి కొడిపాక నారాయణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కట్ట రవికుమార్,ప్రధాన కార్యదర్శి రొంపల్లి సంతోష్,కోశాధికారి నరేష్, మహిళా విభాగం నాయకురాలు ఉప్పల స్వప్న,చందా భాగ్యలక్ష్మి, లంకెలపల్లి మంజుల,రాష్ట్ర నాయకులు కటకం శ్రీనివాస్,చింతల రజనీకాంత్,సంబు పాండయ్య, ఉప్పల నర్సింలు,నేత శ్రీనివాస్ లు, రామకృష్ణ,యువజన విభాగం రాష్ట్ర నాయకులు పాల్గొనడం జరిగింది.


Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >
Image 1

సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Posted On 2026-07-31 05:03:03

Readmore >
Image 1

అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్

Posted On 2026-07-31 05:01:23

Readmore >
Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >