| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వేగం కన్నా ప్రాణం మిన్న

వేగం కన్నా ప్రాణం మిన్న

డైలీ భారత్, హుజూర్ నగర్: వేగంగా గమ్యం చేరాలని ఆరాటం కన్నా ప్రాణం విలువని తనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల భవితవ్యాన్ని గుర్తు పెట్టు కోవాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా  స్థానిక పాత బస్టాండ్ లో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల అమలులోకి వచ్చిన నూతన చట్టాలలో రోడ్డు ప్రమాద కారకులకు కఠిన శిక్షలు నిర్దేశించబడ్డాయని రోడ్డు యాక్సిడెంట్ కేసులో ముద్దాయిగా ఉంటే ఆ కఠిన శిక్షలు అనుభవించవలసి ఉంటుందని ఆమె తెలిపారు. వాహనాలు నడుపు తున్నప్పుడు మద్యం సేవించడం కానీ, హెల్మెట్ ధరించకపోవడం గానీ, సీటు బెల్టు పెట్టుకోకపోవడం గానీ, రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించకపోవడం గానీ శిక్షారమని అటువంటి నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించబడతాయని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణికులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు తదితరుల చేత రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, ఎంఎస్ రాఘవరావు, నాగేష్ రాథోడ్, ఉదారి యాదగిరి,శంకర్ నాయక్, పెండెం సాయిరాం గౌడ్, నాగరాజు నాయక్, రామారావు, ఏఎస్ఐ బలరాం రెడ్డి, న్యాయశాఖ సిబ్బంది అనిత, సుశీల,పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Previous చిల్డ్రన్ హోం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి : సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Next 2లక్షల 33 వేల విలువ గల నిషేధిత సిగిరెట్లను పట్టివేత : ఏసీపీ టాస్క్ ఫోర్స్
ADVERTISEMENT