డైలీ భారత్, తంగళ్ళపల్లి:చిల్డ్రన్ హోం భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి పరిధిలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఆద్వర్యంలో నిర్మిస్తున్న చిల్డ్రన్ హోం నిర్మాణ పనులను ఇంచార్జి కలెక్టర్ బుధవారం పరిశీలించారు.
ఈ సందర్బంగా భవన నిర్మాణ ప్లాన్, పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు.
#rajannasircilla #Mandepalli #sircillacollector #garimaagrawal #childrenhomeBhavan