| Daily భారత్
Logo




సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు, పేకాట (జూదం) వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మి

News

Posted on 2026-01-04 13:58:35

Share: Share


సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు, పేకాట (జూదం) వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం 2026 సంక్రాంతి పండుగను ప్రజలు శాంతియుతంగా, సురక్షితంగా మరియు ఆనందంగా జరుపుకోవాలని జూలూరుపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ లక్ష్మి  మరియు అన్నపురెడ్డిపల్లి మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సింహ రెడ్డి గ్రామప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సమయంలో అన్నపురెడ్డిపల్లి మండలం పరిధిలో కోడి పందేలు, పేకాట (పోకర్/కార్డుల జూదం), అక్రమ మద్యం విక్రయాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిని పూర్తిగా నియంత్రించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.కోడి పందేలు మరియు పేకాట చట్టరీత్యా నేరమని, వీటిలో పాల్గొన్న వారితో పాటు, ఈ కార్యక్రమాలకు స్థలాలు కల్పించిన వారు, నిర్వహించిన వారు, ప్రోత్సహించిన వారిపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైన చోట్ల విస్తృత తనిఖీలు మరియు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.జూదం వంటి అక్రమ కార్యకలాపాలు యువతను తప్పుదారి పట్టించి కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తాయని, ఆర్థిక నష్టాలు మరియు సామాజిక సమస్యలకు దారితీస్తాయని జూలూరుపాడు సిఐ శ్రీ లక్ష్మి తెలిపారు. సంక్రాంతి పండుగ సంప్రదాయాలనుకాపాడుకుంటూ, చట్టాన్ని గౌరవిస్తూ పండుగను జరుపుకోవాలని ప్రజలను కోరారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కోడి పందేలు లేదా జూదం జరుగుతున్నట్లుగ మనించినట్లయితే వెంటనే అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 / 112 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసాఇచ్చారు. ఈ కార్యక్రమంలోఅన్నపురెడ్డిపల్లి ఎస్ఐ విజయ్ సింహరెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >
Image 1

సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Posted On 2026-07-31 05:03:03

Readmore >
Image 1

అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్

Posted On 2026-07-31 05:01:23

Readmore >
Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >