డైలీ భారత్, కామారెడ్డి:ఈరోజు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్బముగా కరపత్రాలు, పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సూచించారు. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో రవాణా శాఖ తరుపున పాఠశాల విద్యార్థులకు రహదారి నియమాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఇట్టి కార్యక్రమములో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే నరసింహ రెడ్డి, జిల్లా రవాణా అధికారి జే. శ్రీనివాస్ తో పాటు, సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, మరియు హోమ్ గార్డ్స్ పాల్గొన్నారు.