| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆన్లైన్ గేమ్ కు బానిసై యువకుడు ఆత్మహత్య

ఆన్లైన్ గేమ్ కు బానిసై యువకుడు ఆత్మహత్య

కామారెడ్డి పట్టణంలో తీవ్ర విషాదం..

ఆన్లైన్ గేమ్ కు బానిసై యువకుడు ఆత్మహత్య

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన ఓ యువకుడు అప్పులపాలై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి సీఐ నరహరి తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఓంశాంతి కాలనీకి చెందిన వల్లందేసి శ్రీకర్(30) ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదిన్నర నుంచి ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడి సుమారు రూ.20 లక్షల అప్పులు చేశాడు. ఇళ్లు అమ్మినా అప్పులు తీరలేదు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. దీంతో ఆ యువకుడి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదఛాయలు  అలుముకున్నాయి .

Previous ఆర్టీసీలో పోస్టులకు 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ
Next ఇందల్వాయి గడి తండాలో పాముకాటుతో యువకుడి మృతి
ADVERTISEMENT