| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇందల్వాయి గడి తండాలో పాముకాటుతో యువకుడి మృతి

ఇందల్వాయి గడి తండాలో పాముకాటుతో యువకుడి మృతి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి తండా పంచాయతీ పరిధిలో పాముకాటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. బానోత్ రాజు (34) పొలంలో గడ్డిమందు పిచికారీ చేస్తుండగా పాముకాటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గురువారం సాయంత్రం పొలానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పొలంలో పడిపోయినట్లు చెప్పారు. అప్పటికే మృతి చెందగా పాము కాటు వేసిందని గుర్తించారు.

Previous ఆన్లైన్ గేమ్ కు బానిసై యువకుడు ఆత్మహత్య
Next మేళ్లచెరువులో ఆటో బోల్తా...కూలీ మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
ADVERTISEMENT