| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రముఖ దళిత నేత మంద కృష్ణ మాదిగ హుజూర్ నగర్ రాక

ప్రముఖ దళిత నేత మంద కృష్ణ మాదిగ హుజూర్ నగర్ రాక

డైలీ భారత్, హుజూర్ నగర్:మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి  వ్యవస్థాపకులు, దళిత సమాజ వెలుగురేఖ  మంద కృష్ణ మాదిగ  జనవరి 3న హుజూర్‌నగర్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దళితుల హక్కులు, దళితుల సమస్యలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై  చర్చించనున్నారు.ఈ కార్యక్రమానికి   ఎంఆర్పీఎస్,ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల నాయకులు, మంద కృష్ణ మాదిగ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఎంఆర్పీఎస్  హుజూర్‌నగర్  నియోజకవర్గ ఇంచార్జ్ బచ్చలకూరి ప్రసాద్ మాదిగ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటన హుజూర్‌నగర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Previous శ్రీకాకుళం జిల్లా : దేవాలయ దొంగతనాల కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
Next స్నేహ సొసైటీలో మాధవి రెడ్డి జయంతి వేడుకలు
ADVERTISEMENT