Posted on 2025-12-31 12:48:48
సిపి సాయి చైతన్య కు వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గ్రామానికి చెందిన భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని 18 డివిజన్ కార్పొరేటర్, స్థానిక ప్రజలు మాజీ కార్పొరేటర్ యమునా అనిల్ కోరారు. బుధవారం
పోలీస్ కమిషనర్ సీపీ సాయి చైతన్య, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కు వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. సోమవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి లకు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు అనిల్, రవి, శ్రీనివాస్, మోహన్, మల్లేష్ మాట్లాడుతూ.. 18వ డివిజన్ ముబారక్ నగర్ కు చెందిన 45 ఎకరాల భూమిని ఏకశిల వెంచర్స్ 1990 లో అమ్మగా అందులో నుంచి 10 శాతం గ్రామం కోసం భూమిని వదిలి వేయడం జరిగిందన్నారు.
ఆ 10 శాతం రెండెకరాల 20 గుంటల భూమిని ప్రస్తుతం కబ్జా చేసి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అక్కడ గ్రామానికి చెందిన పశువుల తొట్టి, బోరుబావి తీసివేసి, గ్రామం కోసం వదిలేసిన స్థలములో ప్లాట్లు వేసి అమ్మాలని చూస్తున్నారని అన్నారు. ఈ విషయం గ్రామానికి చెందిన 18 డివిజన్ సభ్యులను వెళ్లి అడగగా, ఇది మా స్థలం, మేము ఏమైనా చేస్తాము అని మాపై దౌర్జన్యం చేయడం జరిగింది అన్నారు. అక్కడ ఫ్లాట్లు కొన్న చాలామంది పార్కు ఉంటుందని ఉద్దేశంతో కొనడం జరిగిందని, అందరిని మభ్యపెట్టి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కమిషనర్ ను కలిసిన వారిలో శ్రీనివాస్, రవి, చిన్న మల్లేష్, ఆనంద్, సందీప్, అభిలాష్, ప్రసాద్, పెరిక సుమన్, క్యతం గంగాధర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >