| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల: టి టి యు జిల్లా ప్రధాన కార్యదర్శిగా దూస మధు నియామకం

రాజన్న సిరిసిల్ల: టి టి యు జిల్లా ప్రధాన కార్యదర్శిగా దూస మధు నియామకం

డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణ టీచర్స్ యూనియన్(టి టి యు) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా దూస మధు బుధవారం రోజున నియమితులయ్యారు. సిరిసిల్ల పట్టణం లోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్ జీ టీ గా పనిచేస్తున్న దూస మధుని నియమిస్తున్నట్ల టి టి యు రాష్ట్ర అధ్యక్షుడు మునిగాల మణిపాల్ రెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొలంపెల్లి ఆదర్శన్ రెడ్డి, టి టి యు రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు కొండి కొప్పుల రవి నియామక ఉత్తర్వులు అందించారు.

ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని ప్రభుత్వానికి ఉపాధ్యాయుల గళాన్ని బలంగా వినిపించే విధంగా సంఘాన్ని ముందుకు నడిపిస్తానని తెలిపారు. ఉపాధ్యాయుల హక్కులు,సంక్షేమం ,విద్యా ప్రమాణాల కోసం తెలంగాణ టీచర్స్ యూనియన్ కృషి చేస్తుందని అన్నారు.తన నియామకం కోసం కృషి చేసిన జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి కి మరియు తనను నియమించిన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Previous అనారోగ్యంతో బాధపడుతున్న బిఆర్ఎస్ నాయకులు చందు నాయక్ సతీమణి కవితకు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శ
Next భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
ADVERTISEMENT