Posted on 2025-12-30 18:15:59
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రి, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రి, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు, తదితర అంశాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జిల్లా అధికారులు, ఎంఈఓలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ...జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ దరఖాస్తులు లక్ష్యం మేరకు పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు అందరూ ప్రి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అన్నారు. స్కాలర్షిప్ నమోదు కోసం ఎవరికైనా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే వాటిని వెంటనే సంబంధిత విద్యార్థికి అందించే బాధ్యత సంబంధిత తహసీల్దార్ చూసుకోవాలని స్పష్టం చేశారు. అర్హులైన అందరు విద్యార్థులు పోస్ట్ ,ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం నమోదు అయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, డీఈఓ వినోద్ కుమార్, డీఎస్సీడీఓ రవీందర్ రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ భారతి, ఎల్డీఎం మల్లికార్జున రావు తదితరులు ఉన్నారు.
ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >