Posted on 2025-12-30 18:12:15
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ గా మంగళవారం సాయంత్రం సుధీర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయనను పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు.ఈ సందర్బంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మంగళవారం ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచ దేశాలకు తెలిసేలా ఇటీవల గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించుకోవడం జరిగినదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా నేను ఈ రోజు ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర అభివృద్దిలో తమ వంతు బాధ్యతలను నిర్వహిస్తామని అన్నారు. అన్నీ శాఖల సమన్వయంతో పని చేస్తామని, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో 22 పోలీసు స్టేషన్లు పని చేస్తాయని, ఈ పోలీసు స్టేషన్ల అధికారులతో కలిసి టీమ్ వర్క్ తో సమర్థవంతంగా పని చేస్తామని అన్నారు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >