నా చావుకి కారణం తనతో చదువుకున్న ఆ బాలుడి కుటుంబ సభ్యులే..
డిచ్పల్లి మండలం ఓ గ్రామంలో తీవ్ర విషాదం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన చావుకి కారణం తనతో పదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకున్న అబ్బాయి తల్లిదండ్రులు తనను మానసికంగా తీవ్రంగా క్షోభించారని అందుకే వారి వేధింపులు తట్టుకోలేక తాను ఇంటర్మీడియట్ మధ్యలోనే ముగించడం జరిగిందని అయినప్పటికీ కూడా వారి వేధింపులు ఆగకపోగా తనను అపదపదజాలంతో తనను దుర్భాషలాడారని అందుకే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక సూసైడ్ నోట్లో వెల్లడించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.