| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పటినుంచంటే

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పటినుంచంటే

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ శీతకాల అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 2025, డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు గవర్నర్ ఆమోదంతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు బుధవారం (డిసెంబర్ 24) నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన తర్వాత సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.ఈ సెషన్‎లో కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు- రంగారెడ్డి సహా పెండింగ్‌ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీపీ ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రణాళిక గురించి హౌస్‎లో డిస్కస్ చేయనున్నట్లు సమాచారం.ఓ వైపు కృష్ణా, గోదావరి నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం.. మరోవైపు ఆయనకు కౌంటర్‎గా అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడంతో ఈ సెషన్‎పై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న అపొజిషన్ లీడర్ కేసీఆర్.. ఈ సారైనా అసెంబ్లీకి వస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. సభలో అధికార, ప్రతిపక్ష నేతల మాటల యుద్ధం శీతకాలంలో సెగలు రేపనుంది.

Previous లోక రక్షకుడు క్రీస్తు జన్మదినమే క్రిస్మస్
Next కొత్తగూడెం సొసైటీ మాజీ అధ్యక్షులు మండే హన్మంతరావు తల్లి దశదిన కర్మల్లో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల
ADVERTISEMENT