Posted on 2025-12-23 15:51:04
రోడ్డు ప్రమాదాల నియంత్రణ కొరకు నిత్యం వాహన తనిఖీలు చేపట్టాలి
జిల్లా పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఎస్పీ రోహిత్ రాజు
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాలు నందు అధికారులతోసమావేశమయ్యారు.ముందుగా పంచాయితీ ఎన్నికలలో మరియు వర్టీకల్స్ వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు,సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నివారణా చర్యలను చేపట్టాలని సూచించారు.సంవత్సరం చివరలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిత్యం వాహన తనిఖీలు చేపడుతూ,మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.అనంతరం అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి భాదితులకు న్యాయం చేకూర్చాలని తెలిపారు.పోక్సో కేసులలోని నిందితులకు త్వరతగతిన శిక్ష పడే విధంగా కృషిచేయాలని సూచించారు.గంజాయి అక్రమ రవాణా,మట్కా,క్రికెట్ బెట్టింగులు,కోడిపందాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు.అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చేసి నేరాల నియంత్రణకు పాటుపడాలని అన్నారు.ఈ నెల 29,30 తారీఖులలో భద్రాచలంలో జరగనున్న తెప్పోత్సవం,ముక్కోటి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల సమన్వయంతో పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు.వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పార్కింగ్ స్థలాల ఏర్పాటు,రూట్ మ్యాప్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.షీ టీమ్స్,భరోసా కేంద్రాల ఆవశ్యకత గురించి అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి భాధిత మహిళలకు అండగా ఉండాలని తెలిపారు.
ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఐటీ సెల్ సీఐ రాము,ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >