Posted on 2025-12-23 13:13:59
విద్యార్థులను మద్యపానానికి బానిసలు చేస్తే ఊరుకునేది లేదు – నాయకుల హెచ్చరిక
డైలీ భారత్ న్యూస్, చిట్యాల:భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండల కేంద్రంలో ఉన్న లక్ష్మీనరసింహ వైన్స్ కారణంగా జూనియర్ కాలేజీ విద్యార్థులు మద్యపానానికి బానిసలవుతున్నారని ఆరోపిస్తూ,తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ VCK యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్‌లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్, రాష్ట్ర నాయకులు – వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి ఎస్‌ఎఫ్‌కే సాగర్, TRP యూత్ జిల్లా అధ్యక్షులు బండి సునిల్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ –
రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యావ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైందని, నిబంధనల ప్రకారం విద్యాసంస్థలకు కనీసం ఒక కిలోమీటర్ దూరంలో ఉండాల్సిన వైన్ షాపులు మండల కేంద్రాల్లో, కాలేజీలకు అతి సమీపంలో కొనసాగడం వల్ల విద్యార్థులు మద్యపానానికి అలవాటుపడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థినీలు, మహిళలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.వైన్ షాప్ అనుమతుల విషయంలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి, చిట్యాల మండల కేంద్రంలో ఉన్న వైన్ షాపులను ఊరికి దూరంగా తరలించడంతో పాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షాల తరఫున డిమాండ్ చేశారు.
ధర్నా అనంతరం పోలీసులు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీధర్, విష్ణు, మహేష్ కుమార్, కిట్టు, సిద్ధు, చింటూ, మహేష్తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >