| Daily భారత్
Logo




తెలంగాణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు

News

Posted on 2025-12-19 17:35:24

Share: Share


తెలంగాణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు

డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు చేసింది. ఆగష్టు 14వ తేదీనే వీరి పదవీకాలం ముగిసినట్లు పేర్కొంది. వీరితో పాటు తొమ్మిది జిల్లాల డీసీసీజీలను కూడా తొలగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.కాగా, వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సహకార సొసైటీల నిర్వహణకు ఎన్నికల ద్వారా పాలకవర్గాలను నియమిస్తుంది. సొసైటీల సామర్థ్యాలకు అనుగుణంగా ఒక చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు ఉంటారు. ఎన్నికైన పాలకవర్గాలు ప్రభుత్వం ద్వారా వ్యవసాయ, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అమలయ్యే పథకాలను అందిస్తాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల ద్వారా పాలకవర్గాలను ప్రభుత్వం నియమిస్తుంది. గత కేసీఆర్‌ ప్రభుత్వంలో 2020 ఫిబ్రవరి 13న వీటికి ఎన్నికలు జరిగాయి. వీటి పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఫిబ్రవరితో ముగిసిన పదవీ కాలాన్ని 6 నెలలపాటు పొడిగించింది. పొడిగించిన పదవీకాలం కూడా ముగియడంతో తాజాగా పాలకవర్గాలను రద్దు చేసింది.

Image 1

సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న

Posted On 2026-08-01 07:48:28

Readmore >
Image 1

నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-01 07:45:01

Readmore >
Image 1

ఘనంగా హిందీ కవి మున్షీ ప్రేమచంద్ జయంతి నిర్వహణ

Posted On 2026-08-01 05:11:18

Readmore >
Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Posted On 2026-07-31 12:28:25

Readmore >
Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >