Posted on 2025-12-19 15:16:46
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: టీఎన్జీవో ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన, టీఎన్జీవో జిల్లా కార్యాలయం లోని స్వర్గీయ బి.స్వామినాథం సమావేశం మందిరం లో ప్రతి సంవత్సరం మాదిరిగా కులమతాలకు అతీతంగా క్రిస్టమస్ వేడుకలు (సపోస్ క్రిస్టమస్) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ క్రైస్తవ మత గురువులు పాస్టర్ కృపాకర్, అహరోన్, శ్రీనివాస్, శ్యామ్, జగన్ హాజరై క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను అంగరంగ వేగంగా నిర్వహించుకున్నారు
సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు పాస్టర్ కృప మాట్లాడుతూ... క్రిస్మస్ వేడుకలు టిఎన్జీవో సంఘంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, కుల మతాలకు అతీతంగా ఇట్టి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం టీఎన్జీవో అధ్యక్షుడు మాట్లాడుతూ.. జిల్లా ఉద్యోగులకు జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి, ఆ కరుణామయుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ శాంతిని ప్రేరేపిస్తూ, ప్రేమ అనురాగాలతో .... సేవా మార్గాన్ని ఎంచుకోవాలని తెలిపారు.
అనంతరం క్రైస్తవ సోదర సోదరీమణులు ఆధ్యాత్మిక పాటలతో అలరించిన ప్రతి ఒక్కరికి టీఎన్జీవోస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమం లో వీరితోపాటు టిఎన్జీవో జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యం, జాఫర్ హుస్సేన్, అతిక్ అహ్మద్, అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, టీఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్ గారు, మరియు వెస్లీ, సన్నీ, టీఎన్జీవో అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు ,జిల్లా కార్యవర్గ సభ్యులు ఉద్యోగులు మరియు ముఖ్యంగా అన్ని శాఖల క్రిస్టియన్ మైనారిటీ ఉద్యోగులు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >