| Daily భారత్
Logo




44 రోజులపాటు శబరిమలైకు పాదయాత్రగా వెళ్లి సంపూర్ణంగా ముగించుకొని వచ్చిన గురుస్వాములను సత్కరించిన అర్బన్ ఎమ్మెల్యే

News

Posted on 2025-12-19 13:38:32

Share: Share


44 రోజులపాటు శబరిమలైకు పాదయాత్రగా వెళ్లి సంపూర్ణంగా ముగించుకొని వచ్చిన గురుస్వాములను సత్కరించిన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:శబరిమలై అయ్యప్ప స్వామి పాదయాత్ర నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 14వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 44 రోజుల పాటు కొనసాగిన ఈ పవిత్ర పాదయాత్రలో అయ్యప్ప స్వామి దర్శనం సంపూర్ణంగా జరగడంతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా  నివాసంలో వారికి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పాదయాత్రను నందకిషోర్ గురుస్వామి, జగదీష్ గురుస్వామి, రాజేందర్ గురుస్వామి, వసంత్ రాజ్ గురుస్వామి ల ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు నియమనిష్ఠలు పాటిస్తూ పాదయాత్రలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులయ్యారు. పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా, స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే  శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ అయ్యప్ప భక్తుల నియమ దీక్ష, భక్తి నిబద్ధతను అభినందిస్తూ తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ శబరిమలై పాదయాత్ర భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించి, సమాజానికి సద్భావన సందేశాన్ని అందించిందని వారు పేర్కొన్నారు.

Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >