| Daily భారత్
Logo




విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై వీరంగం సృష్టించిన మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్

News

Posted on 2025-12-14 10:24:09

Share: Share


విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై వీరంగం సృష్టించిన మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్

సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న ఓ ఆటో డ్రైవర్ వీరంగం సృష్టించాడు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై బెదిరింపులకు పాల్పడ్డ ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. ట్రాఫిక్ పోలీసులు, వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి నగరంలోని భగత్ సింగ్ చౌరస్తా వద్ద ఓ ఆటో రోడ్డుపై నిలిపి ఉంచడంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అబ్బులు ఆటో డ్రైవర్ వద్దకు వెళ్లి రోడ్డుపై నుండి ఆటో తీయాల్సిందిగా సూచించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న సదరు ఆటో వాలా మహమ్మద్ ఇర్ఫాన్ తనని ఆటో తీయమంటావా అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు అక్కడ గుమ్మిగూడారు. ఆటో డ్రైవర్ ను పట్టుకొని సదరు కానిస్టేబుల్ విషయాన్ని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ కు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన దేవి రోడ్డు చౌరస్తా వద్దకు వచ్చాడు. అనంతరం తనిఖీ చేయగా ఆటో డ్రైవర్ ప్యాంటు వెనుక భాగంలో నడుము వద్ద ఒక కత్తి, ఆటోలో తనిఖీ చేయగా మరో చిన్న కత్తి లభించినట్లు తెలిపారు. తన నడుములో ఒక కత్తి ఆటోలో ఒక కత్తి (మారణాయుధాలు) పెట్టుకొని తిరుగుతున్న సదరు ఆటోవాలాకు డ్రంక్ అండ్ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించి ఉన్నట్లుగా నిర్ధారణ అయినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు. దీంతో అతడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి, ఆటో సీజ్ చేసి ఆటో డ్రైవర్ ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు.

Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >
Image 1

కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

Posted On 2026-07-27 06:48:26

Readmore >
Image 1

ఎంపల్లి.పద్మా రెడ్డి పై కేసు నమోదు

Posted On 2026-07-27 04:38:19

Readmore >
Image 1

ఘనంగా పాపకొల్లు భీమ్లా తండ గ్రామంలో తీజ్ పండుగ

Posted On 2026-07-26 18:58:50

Readmore >
Image 1

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Posted On 2026-07-26 17:19:21

Readmore >
Image 1

సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

Posted On 2026-07-26 16:55:36

Readmore >
Image 1

బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు

Posted On 2026-07-26 16:52:48

Readmore >
Image 1

28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-26 16:51:12

Readmore >