Posted on 2025-12-13 19:37:49
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే ప్రతీ పౌరుడు ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవరుచుకోవాలి. అది ఎక్కడో లేదు, నీలోనే ఉందని జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తన బాధ్యత తెలుసుకోవాలి. రాష్ట్రం,గ్రామం,ప్రతి వాడా అభివృద్ధి చెందాలి, మనందరం బాగుండాలి అనే తాపత్రయం ఉంటేనే సరిపోదు, అందుకు ప్రతీ పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం కల్పించిన ఆయుధం ఓటు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే నిర్ణేతలు. ఓటు అనేది సాధారణ గుర్తు కాదు, పౌరుడు దేశ, రాష్ట్ర, గ్రామ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి” అని పేర్కొన్నారు.మనం నివసిస్తున్న దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల మాటే పరమాధికారం. ఇలాంటి వ్యవస్థలో పౌరుడు పొందే అత్యంత విలువైన హక్కు ఓటు హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి భారత పౌరుడు ఓటు వేసే హక్కును పొందుతాడు. ఈ హక్కు ప్రతి ఒక్కరికీ సమానంగా లభించడం మన ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. ప్రజలు కులం, మతం, డబ్బు, మద్యం వంటి ప్రభావాలకు లోనుకాకుండా అభ్యర్థుల సేవాభావం, నిజాయితీ, పని తీరు మాత్రమే పరిశీలించి ఓటు వేయాలని ఆయన సూచించారు. ఓటు వేయకపోవడం అనేది ప్రజాస్వామ్యానికి నష్టం చేయడమేనని, ఒక చిన్న ఓటే మంచి నాయకులను ముందుకు తెచ్చే శక్తి కలిగి ఉంటుంది. ఎన్నికల సమయంలో యువత ఎక్కువగా జాగ్రత్తగా ఉండి, తన హక్కును వినియోగించడమే కాక, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలి. ప్రతి పౌరుడు ఓటు వేయడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలి. మన ఓటు మన భవిష్యత్తు ను నిర్ణయిస్తుంది కాబట్టి అందరు ఓటు వేయాలని ఆపేక్షించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >