Posted on 2025-12-11 14:53:59
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గురువారం షాబాద్ మండలం సంకేపల్లిగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లావణ్య చెన్నయ్య ప్రచార సభలో చేవెళ్ల కాలే యాదయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి లావణ్య చెన్నయ్యని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు కోరారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని,పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నదని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తే భవిష్యత్ లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని అన్నారు. రాజకీయ, సామాజిక సమీకరణాల్లో భాగంగా అవకాశం దక్కని ఆశావాహులు ఎవరు కూడా నిరాశపడవద్దని. రాబోయే రోజుల్లో వారికి మంచి అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, గణపురం ప్రభాకర్, వార్డు అభ్యర్ధులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >