| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బోధన్ డివిజన్లో ప్రారంభమైన గ్రామ పంచాయతీ పోలింగ్

బోధన్ డివిజన్లో ప్రారంభమైన గ్రామ పంచాయతీ పోలింగ్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్ : బోధన్ డివిజన్ పరిధిలోని ఆయా మండలాలలోని పలు గ్రామాలలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. డివిజన్ పరిధిలోనిబోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, డివిజన్ పరిధిలోని పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల్లో మొదటి విడతలో గ్రామపంచాయతీ  ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 184 సర్పంచి స్థానాలు 1,642 వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు అయ్యాయి. 29 సర్పంచులు, 580 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు 519 సర్పంచి, 2,734 మంది వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.


Previous కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి : జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Next అంబులెన్స్ లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న ఇద్దరు రోగులు
ADVERTISEMENT