డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.బుధవారం షాబాద్ మండలం పెద్దవాడు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీవాణి నవీన్ గౌడ్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందడానికి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఉంటే సులభతరం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవసరమన్నారు అందరూ సమిష్టిగా కృషి చేసి గెలిపించాలని తెలిపారు. ఇందులో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులున్నారు.
News
కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి : జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి