| Daily భారత్
Logo




ముగిసిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం

News

Posted on 2025-12-09 18:04:24

Share: Share


ముగిసిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం ఇవాళ్టి సాయంత్రంతో గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఉత్సాహం క్రమంగా టెన్షన్‌గా మారుతోంది. ప్రచార డప్పులు మోగడం ఆగిపోవడంతో, ఇప్పుడు అభ్యర్థులు, కార్యకర్తలు పోలింగ్ రోజు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొలి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళలు, 201 మంది ఇతర లింగంలోని ఓటర్లు ఉన్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ ప్రారంభమై, అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు.ఎన్నికల నిబంధనల ప్రకారం, ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు తొలి విడత ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులకు బంద్ అమల్లోకి వచ్చింది. ఇక మొదటి విడతలో ఇప్పటికే 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికై, పోటీ లేకుండానే కొత్త పాలన బాధ్యతలు చేపట్టనున్నాయి. తొలి విడత పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతుండగా.. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో టెన్షన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >