| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అర్హత లేని ప్రిన్సిపాల్

నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అర్హత లేని ప్రిన్సిపాల్

ఇన్నాళ్లు చోద్యం చూసిన జిల్లా విద్యాశాఖ..

విషయం బయటకు పొక్కడంతో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన నేషనల్  కన్జ్యూమర్ రైట్ కమిషన్ డిప్యూటీ చైర్మన్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ పాఠశాల అయిన అరబిందో హైస్కూల్ లో  విద్యాశాఖ కు సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నియమాలను పట్టించుకోకుండా పాఠశాల నిర్వహిస్తున్నారని జాతీయ వినియోగదారుల ఫోరమ్ తెలంగాణ శాఖ డిప్యూటీ చైర్మన్ టీ.విశాల్ జిల్లా అధికారులకు లేఖ ద్వారా పిర్యాదు చేశారు. అర్హతలేని వ్యక్తిని పాఠశాల ప్రిన్సిపల్ గా నియమించినట్టూ తెలిపారు.

 ప్రిన్సిపల్ నియామక ప్రక్రియలో ప్రభుత్వ ప్రమాణాలు పాటించకుండా, అర్హతలు పూర్తిగా లేని పుజాగిరి పావని ని ప్రిన్సిపల్ గా నియమించారని జాతీయ వినియోగదారుల హక్కుల సంఘం దృష్టికి వచ్చిందన్నారు. ప్రిన్సిపల్ పదవి అనేది ఒక బాధ్యతాయుతమైన స్థానమని సంబంధిత విద్యార్హతలు, అనుభవం,నిర్వహణ సామర్థ్యాలు తప్పనిసరిగాఉండాలన్నారు.

అయితే పాఠశాల నిర్వహణ పారదర్శకత లేకుండా నియామకం చేపట్టిందనే గాఢ అనుమానం ఉందన్నారు.ఈ నేపథ్యంలో జాతీయ వినియోగదారుల ఫోరమ్ తరఫున జిల్లా విద్యాధికారి, జిల్లా కలెక్టర్ లకు అధికారిక నోటీసులు పంపించామన్నారు.పాఠశాలలో నియామక ప్రమాణాలు అర్హత పత్రాలు, నిర్వహణ విధానాలపై తక్షణ విచారణ చేపట్టాలని కోరామన్నారు.అవసరమైతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Previous కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం
Next ముగిసిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం
ADVERTISEMENT