Posted on 2025-12-06 15:32:07
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు వద్దిరాజు వినతి
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఉమ్మడి జిల్లాలోకేంద్రంతో పాటు వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న ఖమ్మంలో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని, కోవిడ్ వ్యాప్తి సమయంలో జిల్లాలో రద్దు చేసిన పలు ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో రైల్వే మంత్రిని కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైల్వే సమస్యలపై వినతి పత్రం అందజేశారు. బీహార్, ఢిల్లీ, రాజస్థాన్ వైపు వెళ్లే ప్రయాణికులకు సౌలభ్యంగా గయా మాస్, స్వర్ణ జయంతి, జైపూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఖమ్మంలో నిలపాలని విజ్ఞప్తి చేశారు. ఇరుముడి ధరించి, అయ్యప్ప సన్నిధానం శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఖమ్మంలో కేరళ ఎక్స్ ప్రెస్ కు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. గార్ల రైల్వే స్టేషన్లో శాతవాహన, ఇంటర్ సీటీ రైళ్లను ఆపడంతో పాటు స్టేషన్ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >