| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు : కొత్తూరు సీఐ నర్సయ్య

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు : కొత్తూరు సీఐ నర్సయ్య

గ్రామపంచాయతీ ఎన్నికలకు పట్టిష్ట బందోబస్తు

మల్లాపూర్ లో స్పెషల్‌ యాక్షన్‌ టీంల ఫుట్‌ మార్చ్‌

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట పోలీస్ బందోబస్తు చేపట్టామని కొత్తూరు సీఐ నర్సయ్య అన్నారు.ఆదివారం కొత్తూరు మండలంలోని మల్లాపూర్ లో సీఐ నర్సయ్య ఆధ్వర్యంలో స్పెషల్‌ యాక్షన్‌ టీంలు ఫుట్‌ మార్చ్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. ఎన్నికలల్లో పోటీ చేసే అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు,ఎవరైనా సోషల్ మీడియా ద్వారా సామాజిక మధ్యమాల్లో విద్వేషపూరిత వాక్యాలు, రెచ్చగొట్టే పోస్టులను పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఏదైనా పోస్టులు ఫోటోలు,వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సిఐ నర్సయ్య  చెప్పారు.ఎవరి వ్యక్తిగత విషయాలపై పోస్ట్ చేయకుండా సిద్ధాంతం పరంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు సత్యశిల్లారెడ్డి, గోపాలకృష్ణ,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous మచ్చలేని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
Next వైరాకు చెందిన ముగ్గ మురళి కృష్ణకు పీహెచ్.డి
ADVERTISEMENT