డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఆదివారం నిజామాబాద్ జిల్లా మీసేవ యూనియన్ ఆపరేటర్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మీసేవ అసోసియేషన్ యూనియన్ ఆపరేటర్ ఎన్నికలు నిజామాబాద్ లో నిర్వహించడం జరిగిందని రిటర్నింగ్ అధికారులుగా ప్రముఖ న్యాయవాది శ్యామ్ కుమార్, రిటైర్డ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ కాలేవార్ రవి లు పాల్గొన్నారని, ఎన్నికల కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 240 కి పైగా మీసేవ నిర్వాహకుల్లో 151 మంది ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎలక్షన్ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఇందులో 151 ఓట్లలో సితారే క్షవీన్ రాజుకు 129 ఓట్లు దక్కడంతో ఆయన జిల్లా మీసేవ ఆపరేటర్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఒక చెల్లని ఓటు రావడం జరిగిందని ఎన్నికల కమిటీ నిర్వాహకులు గూడూరి శేఖర్, మహమ్మద్ అస్లాం, మహమ్మద్ షాహిద్, కుందేన్ ప్రభుదాస్, టి శివప్రసాద్ లు పేర్కొన్నారు. కాగా మీసేవ యూనియన్ ఆపరేటర్ అసోసియేషన్ జిల్లా ఎన్నికల లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల నుండి మీసేవ నిర్వాహకులు పెద్ద ఎత్తున రావడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం గెలుపొందిన క్షవిన్ రాజు గెలుపొందడంతో ఆయనను గజమాలతో సత్కరించి బాణాసంచాలు పేల్చి మీసేవ కమిటీ నిర్వాహకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
News
మీసేవ యూనియన్ ఆపరేటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా సితారే క్షవీణ్ రాజ్ ఎన్నిక