| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు

హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీ దేవి శనివారం నిజామాబాద్ కు విచ్చేసిన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక రోడ్లు - భవనాల శాఖ అతిథి గృహం వద్ద హైకోర్టు న్యాయమూర్తిని, జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి, కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో  హైకోర్టు న్యాయమూర్తి అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకు ముందు హైకోర్టు జడ్జి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.


Previous కాలేశ్వరం ప్రాజెక్టుపై, తమ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి
Next తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు అవడం దురదృష్టకరం
ADVERTISEMENT