Posted on 2025-11-29 14:28:14
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై నిప్పులు చేరిగిన జాగృతి జిల్లా నాయకులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కాలేశ్వరం ప్రాజెక్టుపై అనవసర అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్న నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇష్టానుసారంగా తమ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై అసత్యపు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఏ ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదన్న తమ అధ్యక్షురాలు కవిత చేసినా వ్యాఖ్యలు ముమ్మాటికి వాస్తవమని ఆయన అన్నారు. 2021 ఏప్రిల్ 22న కొండ పోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ కు గోదావరి నీరు చేరాయని, కేవలం ఆ సంవత్సరం యాసంగి సీజన్ పంటలను కాపాడేందుకు మాత్రమే ఆ నీటిని ఉపయోగించారని ఆయన అన్నారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంబాద్ వరకు నీటిని తరలించాల్సిన అవసరం రాలేదని ఆయన అన్నారు. ఇక 2023 జూలైలో ఎస్ ఆర్ ఎస్ పి పునరుజీవం ప్రాజెక్టు ద్వారా 2.50ఎగువ ప్రాంతం పిఎంసిల నీటిని ఎస్సారెస్పీ లోకి ఎత్తిపోయడం జరిగిందని, ఆ తర్వాత ఎగువ ప్రాంతం నుంచి వరదరావడంతో ఎత్తిపోసిన నీళ్లతో పాటు వరద నీళ్లు స్పెల్ వే గేట్ల ద్వారా గోదావరి లోకి ఎల్లంపల్లి, సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ లను దాటుకుని బంగాళాఖాతంలోకి చేరింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మరి శ్రీరాంసాగర్ ను కాలేశ్వరం నీళ్లతో నింపామన్న ప్రశాంత్ రెడ్డి మాటలు ఎలా నిజమవుతాయని వారు ప్రశ్నించారు. కాలేశ్వరం ప్రాజెక్టు కింద నిజామాబాద్ జిల్లాలో 1,86,262 ఎకరాలు ప్రతిపాదించారని, గారికి ఈ ప్యాకేజీ ద్వారా 20, 21, 21 ఏ ప్యాకేజీ ప్యాకేజీ 22 కింద వీటిలో ఎకరానికి కూడా నీరు రాలేదని ఆయన అన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జివం ఇరిగేషన్ ప్రాజెక్టు ఇరిగేషన్ చరిత్రలోనే అత్యంత అవినీతి ప్రాజెక్టు అని విమర్శించారు. 1,067 కోట్లతో కేవలం నాలుగేళ్లలోనే 2000 కోట్లకు చేరిందని అన్నారు. ఇక తమ జాగృతి అధ్యక్షురాలు బీ ఆర్ ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమె అడుగులకు మడుగులోత్తిన జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం ఆమె పార్టీలో లేదని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఇలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ జాగృతి నాయకులు ఊరుకునే ప్రసక్తే లేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >