Posted on 2025-11-29 07:52:55
అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీ పక్షాన నిలబడతారు
డిసిసి అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లె పల్లెల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని డిసిసి అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని గంగస్థాన్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అత్యంత ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పెట్టి ప్రజలకు మోయలేని భారాన్ని మిగిల్చారని ఆయన అన్నారు అయినా కూడా అభివృద్ధిలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి జిల్లా స్థాయి నేతల వరకు శ్రమించి కష్టపడి పనిచేసే జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేవేయడానికి కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందరం కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు గెలవడం సులభతరం అవుతుందని అన్నారు. అదేవిధంగా డిసెంబర్ ఒకటిన జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణం మండపంలో తన ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సుదర్శన్ రెడ్డి, ఆయన తెలిపారు. మొదటగా మాధవ్ నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుండి ర్యాలీగా వచ్చి నగరంలోని లక్ష్మీ కళ్యాణం మండపం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇతర నాయకులు సమక్షంలో తన ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నూడా చైర్మన్ కేశవేణు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్పగంగారెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శేఖర్ గౌడ్, విపుల్ గౌడ్, తిరుపతి, సంతోష్, జావిద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >