డైలీ భారత్ న్యూస్, కృష్ణాజిల్లా: హోంగార్డ్ 304 B. అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీస్ శాఖ యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో సదరు హోంగార్డ్ పై క్రమశిక్షణ చర్యలకు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్. ఉపక్రమించారు.
ప్రజారక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో పాల్గొనవలసిన హోంగార్డ్ అసభ్య నృత్యాలు చేస్తూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృతంగా వ్యాపించడంతో ఆ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రాగా,వాటిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించవలసిందిగా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వీడియోల ద్వారా ప్రచురితమవుతున్న వార్త నిజ నిర్ధారణ కావడంతో ఈరోజు హోంగార్డు అజయ్ కుమార్ ను వీధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతి పోలీస్ సిబ్బంది, అధికారుల యొక్క ప్రవర్తన పోలీస్ శాఖ యొక్క ప్రతిష్టను పెంచేలా ఉంచాలి గాని అప్రతిష్టకు గురి చేసేలా ఎవరు వ్యవహరించినా వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడేది లేదని, మంచి విధి నిర్వహణ కనపరిస్తే ఏ విధంగా అభినందిస్తామో, అలాగే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంతే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు.