Posted on 2025-11-24 08:05:49
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్: డ్రగ్స్ విక్రయాలపై ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఒకేసారి 3 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎనిమిది మంది డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. నార్సింగి, చందానగర్ , కొల్లుర్ లిమిట్స్‌లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్న పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పరిధిలో 4.5 గ్రాముల హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరిని ఆరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గోపినగర్ వద్ద బస్సులో డ్రగ్స్‌ను తీసుకు వస్తున్న ముఠాను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ముగ్గురిని మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 గ్రాముల MDMA, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ ఈవెంట్‌ను టార్గెట్‌గా పెట్టుకొని డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తోంది ముఠా. మొత్తం ముగ్గురు సభ్యుల ముఠాను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే కొల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 42 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >