Posted on 2025-10-31 17:43:36
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:తెలంగాణ అబ్బాయి, ఫ్రాన్స్ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చైతన్య కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌లో ఉంటున్నాడు. అక్కడ శాన్వి అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. సిరిసిల్లలోని ఓ కల్యాణ మండపంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. వివాహ వేడుకలో అమ్మాయి బంధువులు హిందూ సంప్రదాయ దుస్తులు ధరించారు.
కులాలు వేరు.. ప్రాంతాలు వేరు.. దేశాలు వేరు.. అయినా మనసులు కలిశాయి. ఇంకేముందీ.. ఇద్దరు ఒక్కటయ్యారు. అమ్మాయి ఇక్కడి అబ్బాయికి హిందూ సంప్రదాయ ప్రకారం ఒక్కటయ్యారు. ఈ పెళ్లి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో అబ్బాయి ఇంటి వద్ద శుక్రవారం ఘనంగా ధూమ్ దాంగా జరిగింది. అమెరికాలో ప్రేమించుకున్న ఈ జంట పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ప్యారిస్ ( ఫ్రాన్స్ ) కు చెందిన బెన్ - నేద్ర బెన్, వచ్చారు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చ గారి రాజు గౌడ్ లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు చైతన్యతో ప్యారిస్ ( ఫ్రాన్స్ ) కు చెందిన బెన్ - నేద్ర బెన్, ప్రథమ పుత్రికతో శుక్రవారం బంధుమిత్రుల గ్రామస్తుల సమక్షంలో ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది.
తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చ గారి రాజు గౌడ్ లక్ష్మీల కుమారుడు ఉన్నత చదువుల కోసం ప్యారిస్ వెళ్లారు. అక్కడే ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగంలో చేరాడు ప్యారిస్కు చెందిన సాన్వి( ఇమేన్ బెన్ ) అనే యువతితో ప్రేమలో పడ్డారు. ఇద్దరి మనసులు.. భావాలు కలిశాయి. ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాలు కూడా అంగీకారం తెలిపాయి. దీంతో పెళ్లి వేడుక అబ్బాయి స్వగ్రామమైన తిమ్మాపూర్‌లో తన ఇంటి వద్ద శుక్రవారం జరిగింది. పెళ్లి తెలుగు సంప్రదాయాల ప్రకారం చేశారు. కట్టుబొట్టు తెలుగు దనం ఉట్టిపడేలా ఆమె అలకరించుకుంది. తెలుగు సైతం కొంచెం కొంచెం మాట్లాడుతున్న సాన్వి ఇక్కడి సంప్రదాయం బాగుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
Posted On 2026-07-28 08:06:38
Readmore >
అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు
Posted On 2026-07-28 08:04:20
Readmore >
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >