| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పై దాడి ప్రయత్నించిన,14 మంది పై కేసు నమోదు

జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పై దాడి  ప్రయత్నించిన,14 మంది  పై కేసు నమోదు

డైలీ భారత్, జూలూరుపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామానికి చెందిన మేజర్ యువతిని జూలూరుపాడు గ్రామానికి చెందిన ఓ మేజర్ యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. సదరు నవ దంపతులు తాము మేజర్లు అయినందున తమకు రక్షణ కల్పించవలసిందిగా జూలూరుపాడు పోలీసు వారిని ఆశ్రయించినారు. అయితే సదరు నవ దంపతులు పోలీస్ స్టేషన్లో ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు సుమారు అన్నా పాడు గ్రామానికి చెందిన 100 ఆడ మగ పోలీస్ స్టేషన్ కు చేరుకొని  తమ కుమార్తెను తమకు అప్పగించాలని, పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని గొడవకు దిగార జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఇరువర్గాల వారిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి,సదరు యువతి అభిప్రాయం తల్లిదండ్రులు 100మంది సమక్షంలో తెలుసుకొనగా, తాను మేజర్ అని, ప్రేమించిన వ్యక్తితోనే జీవిస్తానని తన అభిప్రాయాన్ని చెప్పింది. ఈ మాటలు విన్న యువతి తరపు బంధువులు, ఆవేశంతో ఊగిపోయి, నానా హంగామా చేస్తూ పోలీస్ స్టేషన్లో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినారు. ఇట్టి ఘటనలో 14 మంది వ్యక్తులపై కేసు నమోదు అయింది. వీడియో ఆడియో ఆధారంగా మరికొంత మందిని కూడా గుర్తించి వారిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈసందర్భంగాజూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్  ఎస్ఐ బాదావత్ రవి ఈ సందర్భంగా తెలియజేసినారు.

Previous రాజన్న సిరిసిల్ల జిల్లా : వివాహ బంధంతో ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, ఫ్రాన్స్‌ అమ్మాయి
Next పదవి విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ దార్ల పుల్లయ్య
ADVERTISEMENT